నిరుద్యోగులకు టీజీపీఎస్సీ బిగ్ షాక్.. 2022 నాటి 544 ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దు

2 hours ago 1
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు (లెక్చరర్లు), ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి 2022లో జారీ చేసిన బ్రీఫ్ నోటిఫికేషన్‌ను కమిషన్ రద్దు చేసింది. మొత్తం 544 ఖాళీలకు సంబంధించిన ఈ నోటిఫికేషన్‌ను వివిధ అంశాలను పరిశీలించిన తర్వాత రద్దు చేసినట్లు వెబ్‌నోట్‌లో తెలిపింది. కొత్త రూల్స్, రోస్టర్ ప్రకారం త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
Read Entire Article