1980ల రెట్రో ఫొటో ట్రెండ్ ఫాలో అవుతున్నారా? జాగ్రత్త.. ఫోన్‌లోని డేటా చోరీ అయ్యే ప్రమాదం

1 hour ago 1
సోషల్ మీడియాలో 1980ల రెట్రో ఫొటో ఎడిటింగ్ ట్రెండ్ వైరల్‌గా మారిన నేపథ్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజలను అప్రమత్తం చేసింది. ఉచితంగా వింటేజ్ ఫొటోలు తయారు చేస్తామంటూ సైబర్ నేరగాళ్లు నకిలీ లింకులు, ఏపీకే ఫైళ్లను పంపే అవకాశం ఉందని టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. ఇలాంటి లింకులను ఓపెన్ చేసి తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తే ఎస్ఎంఎస్‌లు, ఓటీపీలు, కాంటాక్టులు, వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపారు.
Read Entire Article