తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (FSL) లో 60 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో సైంటిఫిక్ ఆఫీసర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ వంటి పోస్టులు ఉన్నాయి. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంపిక విధానం 100 మార్కుల ఆధారంగా ఉంటుంది. ఇందులో 70 మార్కులు విద్యార్హతలకు, 30 మార్కులు రాత పరీక్షకు కేటాయించారు. అభ్యర్థులు TSLPRB అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు చూసుకోవచ్చు.