నిర్మల్ జిల్లా దిలావర్పూర్ అట్టుడుకుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గతరాత్రి నిర్మల్ ఆర్డీవో కారుపై దాడికి యత్నించారు. కారుపై దాడి చేసి నిప్పు పెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.