నిర్మల్ జిల్లాలో సరికొత్త విప్లవం.. మాతృ మరణాలకు అడ్డుకట్ట వేసిన పథకం.. తాజా గణాంకాలు ఇవే..

6 months ago 12
నిర్మల్ జిల్లాలో మాతృ మరణాలను తగ్గించేందుకు కలెక్టర్ అభిలాష అభినవ్ సారథ్యంలో ప్రారంభించిన ‘అమ్మ రక్షిత’ పథకం అద్భుత ఫలితాలనిస్తోంది. 2030 నాటికి మాతృ మరణాలు లేని జిల్లాగా నిర్మల్‌ను మార్చడమే దీని లక్ష్యం. ఈ పథకం ద్వారా గర్భిణీలకు టిఫా స్కాన్, 2డి ఎకో వంటి ఆధునిక పరీక్షలతో పాటు రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు అందిస్తున్నారు. అత్యవసర స్థితిలో ఉన్న గర్భిణీలను గుర్తించేందుకు కలర్ కోడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. పకడ్బందీ పర్యవేక్షణ కారణంగా గతంలో కంటే మాతృ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. తల్లీబిడ్డల క్షేమం కోసం హెల్ప్ డెస్క్‌లు, టెలిమెడిసిన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు.
Read Entire Article