నిలోఫర్ ఆస్పత్రిలో దాయమ్మగా పని చేసే మహిళ దగ్గర ఖరీదైన ఇంజెక్షన్లు, మందులు వెలుగు చూశాయి. సదరు మహిళ ఆస్పత్రిలోకి వచ్చే సమయంలో రెండు సంచులు తీసుకుని వచ్చింది. ఆమె తీరు కాస్త అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులకు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె వద్ద ఖరీదైన మందులు, ఇంజెక్షన్లు వెలుగులోకి వచ్చాయి. మరి వాటిని దొంగతనం చేసిందా.. లేక బయట నుంచి తెచ్చిందా అనేది తెలియలేదు.