తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేడుకలను ప్రారంభించారు. ప్రపంచ అందగత్తెలు తెలంగాణ కల్లు సేవించి మెచ్చుకున్నారు. ఈ పోటీల ద్వారా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా.. తెలంగాణ పర్యాటక రంగానికి కూడా ఈ పోటీలు ఎంతో దోహదపడతాయి. ఈ నెలాఖరు వరకు జరిగే మిస్ వరల్డ్ పోటీల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.