బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, రష్మిక మందాన నటిస్తున్న సికిందర్ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ నెల 27న సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించినా.. కొన్ని అనివార్య కారణాలతో ఆలస్యమైంది. వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించడంలో ఏఆర్ మురుగదాస్‌కు మంచి పేరు ఉంది.