కూల్‌డ్రింక్స్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో.. అందులో ఉన్న థమ్స్ అప్ బాటిళ్లను ఎత్తుకెళ్లేందుకు స్థానికులు భారీ ఎత్తున ఎగబడ్డారు. ఆ లారీ డ్రైవర్ పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచించకుండా.. దొరికి కాడికి దోచుకున్నారు. చేతులు, సంచుల్లో వేసుకుని థమ్సప్ బాటిళ్లను తీసుకుని జనం పరారయ్యారు. దీంతో చూస్తుండగానే క్షణాల్లోనే లారీలో ఉన్న లోడ్ మొత్తం ఖాళీ అయిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.