Karnataka Gold Man In Nellore: నెల్లూరులో గోల్డ్ మెన్ సందడి చేశారు. ఏకంగా 2 కిలోల బంగారు అభరణాలు ధరించి నగర వీధుల్లో కలియ తిరిగారు. కర్ణాటకు చెందిన రెజీమోన్ అనే వ్యక్తి రెడ్ ల్యాండ్స్ అనే సంస్థలో రీజనల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. నెల్లూరులో డీలర్లను కలిసిందుకు వచ్చిన రెజీమోన్ పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు ధరించి ఓ హోటల్లో భోజనం చేసేందుకు వచ్చారు. చేతులకు భారీ కడియాలు, వేళ్లకు ఉంగరాలు, మెడలో చైన్లు, చెవులకు రింగ్‌లు పెట్టుకుని అటువైపు రావటం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.