ప్రజలకు మరింత చేరువగా పరిపాలనను తీసుకెళ్లే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 620 మండలాల్లో మండల స్థాయి ప్రజావాణిని ప్రారంభిస్తోంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరించనున్నారు. ప్రతి వినతిని డిజిటల్ పోర్టల్‌లో నమోదు చేసి ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వనుండటంతో ప్రజలు తమ సమస్య పరిష్కార స్థితిని సులభంగా ట్రాక్ చేసే అవకాశం లభించనుంది.