Bhogapuram Airport Trial Run: ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం నేడు సాకారం కాబోతుంది. భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం 10.15 గంటలకు తొలి వాణిజ్య విమానంతో ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఈ విమానాశ్రయం నిర్మాణ పనులు 96 శాతం పూర్తి అయ్యాయని అధికారులు తెలిపారు. హుద్‌హుద్ వంటి తుఫానులను తట్టుకునేలా, అధునాతన డ్రైనేజీ వ్యవస్థతో దీన్ని నిర్మించారు. ఈ ఏడాది జులై నుంచి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తుంది.