హైదరాబాద్ ఫార్ములా ఈ కారు రేసు కేసులో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. ఈరోజు (జనవరి 16న) విచారణకు హాజరయ్యారు. సుమారు ఐదున్నర గంటల పాటు కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమని.. రేవంత్ రెడ్డి సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.