కొందరు మేధావులు పేర్లు మార్చి పెళ్లిళ్లు చేస్తారని.. జ్యోతిష్యుడు వేణుస్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. పేర్లు మార్చినంత మాత్రాన ఏమీ జరగదని వ్యాఖ్యానించారు. జాతకాలు చూడటం చేతగాని కొందరు జ్యోతిష్యులు పేర్లు మార్చేసి వివాహాలు జరిపిస్తారని మండిపడ్డారు. పేర్లు మార్చేస్తే.. అన్నీ మారుతాయి అని అనుకుంటే తాను రేవంత్ రెడ్డి అనే పేరు పెట్టుకుంటే సీఎం అవుతానా అని ప్రశ్న లేవనెత్తారు.