ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హోం మంత్రిని కాదని.. అది క్రిమినల్స్ తాలూకా అదృష్టమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు, కాకినాడలో మన ఊరు - మాటామంతీ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. నేరస్థులకు కులం అంటగట్టవద్దని అన్నారు. లా అండ్ ఆర్డర్ తనది కాదని ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానని.. ఇకపై తన అభిప్రాయాలను ప్రజలకే చెప్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.