నేనొస్తుంటే వెళ్లిపోతావా.. బంజారాహిల్స్ సీఐతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాగ్వాదం

1 month ago 4
Padi Kaushik Reddy: బంజారాహిల్స్ సీఐ కేఎం రాఘవేంద్రపై హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్‌కు వస్తే రిసీవ్ చేసుకోవాల్సింది పోయి.. ఇక్కడి నుంచి పారిపోతావా అంటూ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే, సీఐ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన ఫోన్‌ను ప్రత్యర్థులు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు కొంత మంది బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాడి కౌశిక్ రెడ్డి బుధవారం (డిసెంబర్ 4) మధ్యాహ్నం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అయితే, ఆ సమయంలో సీఐ సీఐ రాఘవేంద్ర కారులో బయటికి వెళ్తున్నారు. అది గమనించిన కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు సీఐని అడ్డుకున్నారు. డీసీపీ దగ్గరికి వెళ్తే సీఐని కలమని చెప్పారని.. మేమొస్తున్నామని తెలిసి మీరు బయటికి ఎలా వెళ్లిపోతారని సీఐని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. తర్వాత సీఐని పోలీస్ స్టేషన్‌లోకి తీసుకెళ్లి అక్కడ కూడా వాగ్వాదానికి దిగారు. పోలీస్ యూనిఫాం తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకుని తిరగండంటూ కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ కూడా కౌశిక్ రెడ్డితో గట్టిగానే వాదించారు. ముఖ్యమంత్రి చెప్పినట్టు తాను ఆడటంలేదని.. తన డ్యూటీ తాను చేస్తున్నానని బదులిచ్చారు.
Read Entire Article