తెలంగాణలోని రాష్ట్ర రహదారులకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర రోడ్లను నేషనల్ హైవేలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ సర్కార్ నివేదికలు రూపొందిస్తోంది. నివేదికలను కేంద్రానికి సమర్పించనుండగా.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత అప్‌గ్రేడ్ చేయనున్నారు. తద్వారా రోడ్ల కనెక్టివిటీ, అభివృద్ధి జరగనుంది.