భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం, సుభాష్ నగర్ పంచాయతీ బీఆర్ఎస్ మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి వల్లాల మంగమ్మ శుక్రవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. భర్త వల్లాల నరసయ్య ఫిర్యాదు మేరకు ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. డిసెంబర్ 3న నామినేషన్ వేయాల్సి ఉండగా ఆమె అదృశ్యం కావడం వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి, విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.