కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు రావాల్సిన 16వ ఆర్థిక సంఘం నిధులను త్వరలోనే విడుదల చేయనుంది. గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారుల పేరుతో బ్యాంకులో ఖాతాలు తెరవాలంటూ ఇప్పటికే కేంద్ర ఆదేశించింది. ఈ నిధులను స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా ఖర్చు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ నిధుల్లో 40 శాతం పారిశుద్ధ్యం, 40 శాతం రహదారులు, మంచినీరు, వీధి దీపాలకు ఖర్చు చేయాలి. మరో 20 శాతం నిధులు కేంద్రం తన వద్దే ఉంచుకోనుంది.