సంక్రాంతి పండుగ వేళ ఏపీకి కేంద్రం శుభవార్త వినిపించింది. భారీగా నిధులు విడుదల చేసింది. పన్నుల్లో వాటా కింద పలు రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. మొత్తం రూ.1,73,030 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఏపీకి రూ.7002 కోట్లు దక్కాయి. అటు తెలంగాణకు రూ.3637 కోట్లు విడుదల చేశారు. అత్యధికంగా యూపీకి రూ.31 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించారు. ఆ తర్వాత బిహార్, బెంగాల్ రాష్ట్రాలకు అధిక నిధులు దక్కాయి. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఏపీకి అధికంగా నిధులు దక్కాయి.