సంక్రాంతి పండుగ వేళ అనకాపల్లి జిల్లాలో జాలర్లకు జాక్‌పాట్ తలిగింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేపలు చిక్కాయి. వల విసిరిన జాలర్లకు మూడు కచిడి చేపలు చిక్కాయి. వాటిని స్థానికంగా వేలం వేయగా.. నెల రోజుల కష్టపడితే వచ్చే డబ్బులు, ఆ జాలర్లకు ఒక్కరోజులోనే వచ్చాయి. దీన్ని పండుగ పూట గంగమ్మ తల్లి ఇచ్చిన దీవెనగా వారు చెబుతున్నారు. ఈ అరుదైన కచిడి చేపలను 'గోల్డెన్' ఫిష్‌గా పిలుస్తుంటారు.