పండ్లు, కూరగాయల్లో పురుగుమందుల అవశేషాలు.. దేశంలోనే తెలంగాణ టాప్, విషాన్ని తింటున్నామా..?

3 weeks ago 14
పండ్లు, కూరగాయలలో అనుమతించిన పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు నమోదైన కేసుల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు లోక్‌సభ గణాంకాలు వెల్లడించాయి. 2023-2026 మధ్య పరీక్షించిన 8,198 నమూనాల్లో 5.9 శాతం పరిమితి దాటినట్లు తేలింది. ఇది జాతీయ సగటు 3.1 శాతం కంటే దాదాపు రెట్టింపు. హెక్టారుకు 0.530 కిలోల క్రిమిసంహారకాలను తెలంగాణలో ఉపయోగిస్తున్నారు. పదేపదే ఈ రసాయనాలు శరీరంలోకి చేరడం వల్ల కాలేయం, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని.. వ్యవసాయ స్థాయిలో వీటి పరిమితిని తగ్గించడమే ఏకైక మార్గమని వైద్యులు సూచిస్తున్నారు.
Read Entire Article