జిల్లా కలెక్టర్ల సమావేశం సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లాల మధ్య తలసరి ఆదాయంలో వచ్చిన మార్పులపై చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కోనసీమ జిల్లాతో పోలీస్తే .. సత్యసాయి, అనంతపురం జిల్లాల తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని చంద్రబాబు అన్నారు. కరువు పీడిత ప్రాంతం, వెనుకబడిన జిల్లాగా ఉన్న అనంతపురం జిల్లా కోనసీమ జిల్లా కంటే తలసరి ఆదాయంలో ముందుందనిగుర్తుచేశారు. హార్టికల్చర్, సెరికల్చర్ ద్వారా రాయలసీమ జిల్లాల్లో తలసరి ఆదాయం పెరిగిందన్న ఆయన.. ఇలాంటి విధానాలను ఇతర జిల్లాలలో కూడా అమలు చేయాలన్నారు.