Enumamula Agricultural Market: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర ఈ సీజన్‌లో తొలిసారిగా క్వింటాకు రూ.9,060కు చేరింది. సోమవారం 3,157 బస్తాల పత్తి మార్కెట్‌కు రాగా.. నాణ్యతను బట్టి రూ.5 వేల నుంచి రూ.9,060 వరకు ధర లభించింది. ఎల్‌నినో ప్రభావం, వర్షాల లోటు, తెగుళ్లతో దిగుబడులు తగ్గడం ధరల పెరుగుదలకు కారణాలుగా భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.8,667 కాగా.. అధిక ధర కొంత ఊరటనిస్తున్నా పెట్టుబడి ఖర్చులు, పంట నష్టాలతో రైతుల నికర ఆదాయం తగ్గుతోంది.