కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ తర్వాత తొలిసారిగా కొండా దంపతులు వరంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి పోయినా తన భార్య కొండా సురేఖ ‘సారీ’ చెప్పలేదని తెలిపారు. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయని.. కానీ మాట కోసం నిలబడటమే తమ ముఖ్యమని పేర్కొన్నారు. తమ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.