టీజీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో బుర్రా వెంకటేశం కీలక వ్యాఖ్యలు చేశారు. వస్తూనే కొంతమందికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక నుంచి పరీక్షల వాయిదాలు ఉండవని.. అలాంటి ఆలోచనలు ఉంటే ఇప్పుడే తొలగించుకోండి అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ఉన్నానని.. ధైర్యంగా పరీక్షలు రాయాలని అభ్యర్థులకు ఓ భరోసా ఇచ్చారు.