తమ కుమార్తె కనిపించకుండా పోయిందని ఓ కుటుంబం పవన్ కళ్యాణ్ ను వేడుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 20 రోజుల నుండి కనిపించకుండా పోయిన బాలిక కేసును పోలీసులు 48 గంటల్లో చేధించారు. డిప్యూటీ సీఎం సభలో ప్లకార్డులు ప్రదర్శించడంతో పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయం వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. నిరసన తెలిపితేనే స్పందిస్తారా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.