ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను పార్లమెంట్‌లో తలుపులు మూసేసి చేశారన్న ఉండవల్లి అరుణ్ కుమార్.. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై తాను పదేళ్లుగా పోరాడుతూనే ఉన్నానని చెప్పారు. ఈ విషయమై సుప్రీంకోర్టులో తాను పిటిషన్ వేస్తే.. కేంద్రం ఇన్నేళ్లయినా కౌంటర్ దాఖలు చేయలేదని చెప్పారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నందున పవన్ కళ్యాణ్ ఆ బాధ్యత తీసుకోవాలని.. రాష్ట్రం నుంచి కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని ఉండవల్లి సూచించారు.