రాష్ట్రంలోని అన్ని పంచాయితీలలో చర్చిలకు అనుమతులు ఉన్నాయా లేదా అనే సమాచారం సేకరించాలని పవన్ కళ్యాణ్ ఓఎస్డీ ఇచ్చిన నోటీస్‌పై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఆ నోటీసును మళ్లీ తిరిగి ఎందుకు వెనక్కి తీసుకున్నారని కేఏ పాల్ ప్రశ్నించారు. చర్చిల అనుమతులు చెక్ చేస్తావా.. చర్చిలోకి ఎందుకు వెళ్లావు పవన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మర్డర్ చేసి సారీ చెబితే అయిపోతుందా.. పవన్‌కళ్యాణ్‌కు ముందు తెలియదా' అంటు పాల్ విమర్శించారు.