డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో పిఠాపురం నియోజకవర్గం రూపురేఖలు మారుతున్నాయి. పిఠాపురం పట్టణం అభివృద్ధికి రూ.308.24 కోట్లు కేటాయించారు. రూ. 200 కోట్లతో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఏలేశ్వరం నుంచి పిఠాపురానికి తాగునీరు అందించేలా పనులు చేపడుతున్నారు. రూ. 59.52 కోట్లతో కొత్త పైప్‌లైన్, ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది. పిఠాపురం పట్టణంలో దాదాపు 5 వేల కొత్త తాగునీటి కనెక్షన్లు అందిస్తున్నారు. కోట్లాది రూపాయలతో రహదారులు, కాలువల నిర్మాణం జరుగుతోంది.