ఈసారి గణేష్ ఉత్సవాలు హైదరాబాద్‌లో భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 1.40 లక్షల గణేష్ మండపాలు ఏర్పాటు కానున్నాయని ఉత్సవ సమితి వెల్లడించింది. వీటి కోసం ప్రభుత్వం, పోలీస్, జీహెచ్‌ఎంసీ, ఇతర శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయి. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిమజ్జనాల కోసం ఆరు విడతల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల్లోనూ నిమజ్జనాలు నిర్వహిస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది.