Guntur Brain Surgery While Patient Watching Og Movie: గుంటూరు జిల్లా డీవీసీ ఆస్పత్రి డాక్టర్లు కీలక సర్జరీ పూర్తి చేశారు. ఓ మహిళా పేషెంట్ మెదడులోని కీలక భాగానికి సమీపంలో గడ్డ ఏర్పడింది. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఆ మహిళకు డాక్టర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా చూపిస్తూ రోగి స్పృహలో ఉండగానే సర్జరీని పూర్తి చేశారు.