కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో పసుపు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ-నామ్ విధానంలో నిర్వహించిన వేలంలో కాడి రకం పసుపు క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.19,253 పలికింది. గోళ రకం పసుపునకు అత్యధికంగా రూ.18,566 లభించింది. ఈనెల 22న నమోదైన రూ.13,319 గరిష్ఠ ధరతో పోలిస్తే కాడి రకం పసుపు ధర దాదాపు రూ.6 వేలు పెరిగింది. నాణ్యమైన పసుపు పంట కోసం వ్యాపారుల మధ్య పోటీ పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గిపోతుండటంతో ధరల పెరుగుతున్నాయి.