బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటు వేయాలని.. పాకిస్థాన్ గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓటేయ్యాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటేనని అన్నారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్, కారు రేస్ కేసుల్లో సీబీఐ విచారణ ఎందుకు కోరట్లేదని ప్రశ్నించారు. ప్రభాకర్ రావు పారిపోయేందుకు సహకరించింది కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. కారు రేస్‌లో కేటీఆర్ హస్తం ఉందని కేబినెట్ మంత్రులు కూడా అన్నారని.. మరి కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయటం లేదని ప్రశ్నించారు.