తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై ఇటీవల స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. మరో మూడు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీన్ని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీంతో తాజాగా స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యంపై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6న వాయిదా వేసింది.