Nara Lokesh On Pastor Praveen Pagadala Death: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పాస్టర్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారని పోలీసులు చెబుతుంటే.. క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, తోటి పాస్టర్లు మాత్రం హత్యగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు స్పందించారు. ఆయన మరణంపై విచారం వ్యక్తం చేశారు.. సీఎం డీజీపీతో మాట్లాడి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించారు.