పాస్టర్ ప్రవీణ్ పగాడల మృతి ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనితస్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. పాస్టర్ మరణంపై సమగ్ర విచారణకు జరపాల్సిందిగా హోంమంత్రి ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. క్రైస్తవసంఘాలు కోరిన మేరకు పోస్టుమార్టం వీడియో రికార్డింగ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అయితే ప్రవీణ్‌ది రోడ్డు ప్రమాదమని కేసు నమోదు చేయలేదని.. అనుమానాస్పద మరణంగానే కేసు నమోదు చేశామన్నారు హోంమంత్రి అనిత.