పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల మృతదేహం మంగళవారం ఉదయం స్థానికులకు కనిపించింది. ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారని అంతా భావించారు. అయితే ఆయన శరీరంపై గాయాలు ఉన్నాయని స్నేహితులు, సన్నిహితులు చెప్తున్నారు. ప్రవీణ్ పగడాల మరణంపై అనుమానాలు ఉన్నాయని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మహాసేన రాజేష్, జీవీ హర్ష కుమార్ వంటి నేతలు కూడా స్పందించారు.