అర్హులైనవాకి పింఛన్లు రాకపోగా.. అనర్హులు కొందరు పింఛన్లు తీసుకుంటున్నట్టు పలు ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హులను వేటుకు సిద్ధమవుతున్నారు.. అర్హత లేకపోయినా సరే కొందరు పింఛన్లు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇందుకోసం ఓ యాప్ తీసుకొస్తోంది. ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీకి ఈ యాప్‌కు రూపకల్పన చేశారు. దీని కోసం ఐటీ, రవాణాశాఖ, కేంద్ర సర్వీసులకు సంబంధించిన శాఖల నుంచి అవసరమైన డేటాను తీసుకున్నారు.