డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇకపై తరుచుగా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం అధికారులు గెస్ట్ హౌస్ సిద్ధం చేస్తున్నారు. రోడ్లు భవనాల శాఖకు చెందిన గెస్ట్ హౌస్‌ను పవన్ కళ్యాణ్ బస, సమీక్షల కోసం ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రూ. 50 లక్షలు ఖర్చుచేసి ఆ భవనాన్ని ఆధునీకరించే పనులు గత 20 రోజుల నుంచి జరుగుతున్నాయి.