ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన ఆరోపణలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఘాటుగా సమాధానమిచ్చారు. కొండా సుస్మిత కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేని వ్యక్తి అని, సీఎం రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోరని మండిపడ్డారు. దమ్ముంటే సీఎంపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు. వ్యక్తిగత విమర్శలకు స్పందించి తన స్థాయిని తగ్గించుకోనని రేవూరి కూడా కామెంట్స్ చేశారు. ప్రజల్లో ఉన్న మంచి పేరు ఆధారంగానే రేవంత్ తనను పరకాల అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు.