పిల్లల ముందు మహిళతో అశ్లీల నృత్యాలు.. హోంగార్డు సస్పెండ్..

3 months ago 9
కృష్ణా జిల్లా కంకిపాడులో ఓ హోంగార్డు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కంకిపాడు సీఐ వద్ద జీపు డ్రైవర్‌గా పనిచేసే అజయ్ కుమార్ అనే హోంగార్డు ఓ మహిళతో చేసిన అశ్లీల నృత్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజనం నుంచి తీవ్రంగా విమర్శలు వచ్చాయి. హోంగార్డుగా పనిచేస్తూ చిన్నారుల ఎదుట మహిళతో అలాంటి అసభ్యకరమైన నృత్యాలు ఏమిటంటూ మండిపడ్డారు. అయితే సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావటంతో.. విషయం ఎస్పీ వరకూ చేరింది. దీంతో హోంగార్డు విజయ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అతనిపై విచారణకు ఆదేశించారు.
Read Entire Article