పిల్లలతో కలిసి బావిలో దూకిన తల్లి.. కొమ్మ పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న కుమారుడు

1 month ago 10
నిత్యం మద్యం తాగొచ్చి నరకం చూపిస్తున్న భర్త వేధింపులను తట్టుకోలేక ఒక వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి వ్యవసాయ బావిలోకి దూకింది. ఈ హృదయవిదారక ఘటనలో తల్లి, పదిహేనేళ్ల కుమార్తె నీట మునిగి ప్రాణాలు కోల్పోగా.. ప్రాణభయంతో కొట్టుమిట్టాడిన కుమారుడు బావిలోని చెట్టుకొమ్మను గట్టిగా పట్టుకుని అరగంట పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘోరం సంచలనం రేకెత్తించింది.
Read Entire Article