Piler Scanning Centre Issue: పీలేరులో స్కానింగ్ సెంటర్‌లో డాక్టర్ నిర్వాకం బయటపడింది. మూడుసార్లు స్కానింగ్ సెంటర్ సీజ్ చేసినా పద్ధతి మార్చుకోలేదు.. మళ్లీ, మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తున్నట్లు గుర్తించారు. స్కానింగ్ సెంటర్‌ను పీసీపీఎన్‌డీటీని అధికారులు సీజ్ చేశారు. గతంలో ఇదే అభియోగాలపై సీజ్ చేసినా పద్దతి మార్చుకోలేదు. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా మరో కొత్త మెషీన్‌తో స్కానింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసి షాకయ్యారు.