హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదాలను తగ్గించేందుకు హెచ్‌ఎండీఏ రూ.7 కోట్లతో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్ ఏర్పాటు చేయనుంది. మరో వారం నుంచి పది రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. 11.63 కిలోమీటర్ల మార్గంలో 19 పీటీజెడ్, 10 ఏఎన్‌పీఆర్ కెమెరాలతోపాటు వేగాన్ని ప్రదర్శించే వీఎస్‌డీ, ట్రాఫిక్ హెచ్చరికలు ఇచ్చే వీఎండీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఐఐటీ హైదరాబాద్ సాంకేతిక సహకారంతో రూపొందుతున్న ఈ వ్యవస్థను ప్రస్తుత కంట్రోల్ రూమ్‌కు అనుసంధానిస్తారు. అతివేగాన్ని నియంత్రించడం, ఉల్లంఘనలను గుర్తించడం, ప్రమాదాలపై త్వరగా స్పందించడం దీని ప్రధాన లక్ష్యాలుగా హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు.