పురోహితుడి ప్రాణం తీసిన కొబ్బరిబొండం.. అనుకోని రీతిలో మరో వ్యక్తి కూడా మృతి

2 months ago 9
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బైపాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.రాజమండ్రికి చెందిన హరిప్రసాద్ అనే పురోహితుడు.. హైదరాబాద్ నుంచి కారులో రాజమహేంద్రవరం వస్తున్నారు. ఈ సమయంలో ఆయన కారు అదుపుతప్పి ఓ బైకును, ఓ కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని హరిప్రసాద్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్ మీద ఉన్న గురవయ్య అనే వ్యక్తి కారు ఢీకొనడంతో కిందపడి మృతి చెందారు. అయితే కారు బ్రేక్, క్లచ్ మధ్యలో కొబ్బరిబొండం ఇరుక్కోవటం వలనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
Read Entire Article