పులకించిన తిరుమల.. 9 టన్నుల పుష్పాలతో శ్రీవారికి పుష్పయాగం

4 months ago 7
ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు టన్నులు, కర్ణాటక నుంచి రెండు టన్నులు, తమిళనాడు నుంచి ఐదు టన్నుల పుష్పాలను ఈ యాగం కోసం సేకరించారు.
చామంతి, సంపంగి, నూరు వరహాలు, గులాబీ, కనకాంబరం, మల్లె, తులసి, మరువం, దవనం వంటి 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో స్వామి, అమ్మవార్లకు అంగరంగ వైభవంగా పుష్పార్చన జరిగింది. ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించిన అనంతరం, మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేదమంత్రాల నడుమ ఈ కైంకర్యాన్ని వేదపండితులు నిర్వహించారు.
Read Entire Article