హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌ను సందర్శించే వారికి తీపి కబురు. త్వరలోనే తెల్ల పులితో సెల్ఫీ దిగొచ్చు. సందర్శకుల కోసం అత్యాధునిక టైగర్ గ్లాస్ ఎన్‌క్లోజర్ అందుబాటులోకి రానుంది. తర్వాత సింహాలు, పెద్దపులులకూ ఇలాంటి ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేయనున్నారు. టన్నెల్ అక్వేరియం, ఏవియరీ, 9డీ డిజిటల్ సెంటర్ వంటి మరిన్ని కొత్త ప్రాజెక్టులతో జూ మరింత ఆకర్షణీయంగా మారనుంది. గ్లాస్ ఎన్‌క్లోజర్ అందుబాటులోకి వస్తే పులితో సరదాగా సెల్ఫీ దిగే ఛాన్స్ ఉంటుంది.