అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా రేపు (డిసెంబర్ 5) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు కటౌట్లు, ఫ్లెక్సీలతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా గుత్తిలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గుత్తిలో అల్లు అర్జున్, వైఎస్ జగన్ ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మాకోసం నువ్వొచ్చావు.. నీ కోసం మేమొస్తాం అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గుత్తిలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.