Allu Arjun Meets Chiranjeevi After Pushpa 2 Success: అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా భారీగా కలెక్షన్లను వసూలు చేస్తోంది.. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ను అందరూ అభినందిస్తున్నారు. అయితే మూవీ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారంటూ సోషల్ మీడియాలో ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు లింక్ చేస్తూ ఫోటోను ట్వీట్ చేశారు. మరి నిజంగానే అల్లు అర్జున్ మెగాస్టార్‌ను కలిశారా?.. ఈ ఫోటో వెనుక అసలు నిజం ఏంటి?